ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం VM బంజర్ రింగ్ సెంటర్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఖమ్మం వైపు నుంచి సత్తుపల్లి వైపు వెళ్తుండగా VM బంజర్ రింగ్ సెంటర్లో లారీ టైర్లు పగిలిపోయాయి. దీంతో రోడ్డుకు అడ్డంగా లారీ నిలిచిపోయింది. అయితే అతి వేగంగా మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడ్డాడని స్థానికులు డ్రైవర్ను చితకబాదారు. స్థానికుల దాడిలో డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. రోడ్డు పక్కనే ఉన్న షాపుల పైకి దూసుకెళ్ళకుండా లారీని ఆపివేసినా తనను అకారణంగా కొట్టారని డ్రైవర్ వాపోయాడు.
ALSO READ : Viral Video: భూ వివాదంలో మహిళపై దాడి.. వీడియో వైరల్.. టీఎంసీ నేత అరెస్ట్
అంతేకాదు.. లారీని రోడ్డుపై నుంచి తీయకుండా డ్రైవర్ అక్కడే నిలిపి ఉంచటంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన డ్రైవర్ను ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. అనంతరం లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.